కామారెడ్డి జిల్లాలో చైనా మాంజా స్వాధీనం

కామారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో ఎక్కడైన చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సింధూశర్మ హెచ్చరించారు. స్పెషల్ పోలీసులు, దేవునిపల్లి పోలీసులు తనిఖీలలో భాగంగా దేవునిపల్లిలోని ఓ కిరాణ షాపులో చైనా మాంజా అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. షాపులో నుంచి  65 బెండల్స్​ చైనా మంజా స్వాధీనం  చేసుకొని సీజ్​ చేసినట్లు ఎస్పీ వివరించారు.

ఎక్కడైనా చైనా మంజా అమ్మినట్లు తెలిస్తే  టాస్క్​ఫోర్స్​ సీఐ సెల్​ నంబర్ 8712686112కు సమాచారం అందించాలన్నారు.  దేవునిపల్లిలో  చైనా మంజా అమ్మిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ చైతన్యరెడ్డి పేర్కొన్నారు.