బ్యాంక్ కు వెళ్లి డబ్బులు డ్రా చేస్తాం.. బ్యాంక్ వాళ్లు చక్కగా మెషీన్లలో లెక్కపెట్టి ఇచ్చేస్తారు.. ఎంత డబ్బు అయినా నిమిషాల్లో మెషీన్లలో లెక్క పెట్టేస్తారు.. అయితే ఓ కస్టమర్ మాత్రం చిత్రమైన డిమాండ్ చేశాడు.. తన ఖాతా నుంచి 5 కోట్ల 65 లక్షల రూపాయలు డ్రా చేయాలని బ్యాంక్ వచ్చాడు.. చక్కగా బ్యాంకు వాళ్లు మొత్తం డబ్బును సూటుకేసుల్లో పెట్టారు.. ఇక్కడ కస్టమర్ ఓ పాయింట్ రైజ్ చేశాడు.. మీ మెషీన్లను నేను ఎందుకు నమ్మాలి అని.. నాకు చేతులతో లెక్క పెట్టి ఇవ్వండి.. అది కూడా నా కళ్ల ముందు అని డిమాండ్ చేశాడు.. దీంతో షాక్ అయ్యారు బ్యాంక్ ఉద్యోగులు.. కస్టమర్ల డిమాండ్ లో న్యాయం ఉంది.. తప్పని పరిస్థితుల్లో లెక్క పెట్టారంట.. ఇన్నాళ్లు తప్పిన అలవాటుతో.. బ్యాంక్ సిబ్బంది చేతులు పడిపోయాయి అంట.. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..
చైనాలోని షాంఘై నగరానికి చెందిన ఓ మిలియనీర్ డబ్బు డ్రా చేసుకునేందుకు షాంఘై బ్యాంకు వెళ్లాడు. రూ. 5.69 కోట్ల డబ్బును డ్రా చేయాలని నిర్ణయించు కున్నాడు. ఫార్మాల్టీస్ పూర్తయ్యాక బ్యాంకు అధికారులు రెండు సూట్ కేసుల్లో డబ్బును తెచ్చి కస్టమర్ ముందర పెట్టాడు. అయితే ఆ మిలియనీర్ బ్యాంకు సిబ్బంది ఓ కండిషన్ పెట్టాడు.. నగదును మెషీన్లతో కాదు.. చేతులతో లెక్కపెట్టి ఇవ్వాలని డిమాండ్ చేశాడు.. రూల్స్ ప్రకారం చేసేదేమీ లేక ఇద్దరు బ్యాంక్ సిబ్బంది రెండు గంటలకు పాటు శ్రమించి నోట్లు లెక్కపెట్టి మిలియనీర్ కు ఇచ్చి పంపించారు. అయితే దీని వెనక అసలు కథ వేరే ఉంది..
ఈ ఘటన 2021లో జరిగింది. అప్పుడు కోవిడ్ టైం.. మిలియనీర్ బ్యాంకులోకి ప్రవేశిస్తుండగా బ్యాంకు సెక్యూరిటీ తన పట్ల దురుసుగా వ్యవహరించారని.. అది మనసులో పెట్టుకొని మిలియనీర్ ఇదంతా చేశాడట.. బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది తనపట్ల అగౌరవంగా వ్యవహరించినందుకే మిలియనీర్ కావాలనే బ్యాంకు సిబ్బందితో డబ్బులు మాన్యువల్ గా లెక్క పెట్టించారట..
ఈ ఘటనకు సంబంధించి మరో ట్విస్ట్..
వాస్తవానికి మిలియనీర్ పట్ల బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించలేదని బ్యాంకు అధికారులు తేల్చేశారు..కోవిడ్ టైం కాబట్టి.. బ్యాంకులోకి ప్రవేశిస్తున్న మిలియనీర్ ను మాస్క్ పెట్టుకోమన్నందుకు బ్యాంకు సెక్యూరిటీ సిబ్బందిపై అతనే దురుసుగా ప్రవర్తించాడట.
ఈ ఘటనపై ఆన్ లైన్ యూజర్లు భిన్నంగా స్పందించారు. కొంతమంది ఫన్నీ ఇన్సిడెంట్ అని నవ్వుకోగా.. మరికొంత మిలియనీర్ నియమాలు పాటించమని అడగడం బాగుందని అన్నారు.. ఇంకొందరు మాస్క్ ధరించమన్నందుకు మిలియనీర్ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు. మరికొందరు మాత్రం ఈ సంఘటనే ఓ ఫేక్ ఇన్సిడెంట్ అని కొట్టి పారేశారు.
ALSO READ : Men Special : అబ్బాయిల్లో మూడ్ స్వింగ్స్.. అప్పటికప్పుడు మారిపోతున్నారంట..!