చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా. ఈ వైరస్ వ్యాప్తికి సరైన కారణాన్ని ఇప్పటి చెప్పలేక పోతున్నారు చైనా సైంటిస్టులు. రోజుకో కొత్త విషయం చెబుతున్నారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు నివారణ చర్యలు చేస్తున్నామని చెబుతున్న శాస్త్రవేత్తలు చెబుతున్నా…దాని వ్యాప్తికి అసలు కారణాన్ని ఇప్పటి వరకు చెప్పలేక పోతున్నారు.
మొదట కరోనా వైరస్ పాములు, గబ్బిలాల నుంచి వస్తుందని చెప్పిన సైంటిస్టులు ఇప్పుటు లేటెస్టుగా అలుగు (పాంగొలిన్) కూడా ఇందుకు కారణం కావొచ్చంటున్నారు. వీటి జన్యుక్రమం కరోనా కొత్త తరహా వైరస్‌తో 99 శాతం సరిపోలుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. చైనా సహా మరికొన్ని దేశాల్లోనూ అలుగులను తింటారు. దీంతో వైరస్ వ్యాప్తికి ఇదే కారణం అయి ఉంటుందని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తపరిచారు.