సోలార్​లో చైనాకు చెక్‌: గౌతమ్​ అదాని భరోసా

సోలార్​లో చైనాకు చెక్‌:  గౌతమ్​ అదాని భరోసా

సోలార్​లో ప్రపంచపు
టాప్ కంపెనీగా మారతాం
2025 నాటికి 25 గిగావాట్లు సోలార్ విద్యుత్​ ఉత్పత్తి

న్యూఢిల్లీ : ఇండియన్ సోలార్ మార్కెట్‌‌లో చైనీస్ సోలార్ ఎక్విప్‌‌మెంట్ వాటా వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో పడిపోతుందని   లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీ తెలిపారు. ప్రస్తుతం మన మార్కెట్‌‌లో చైనా దిగుమతులు 90 శాతం దాకా ఉన్నాయి. 8 గిగావాట్ల సోలార్‌‌ విద్యుత్ ( ప్రపంచంలోనే అతిపెద్ద) ప్రాజెక్ట్‌‌ను ఇటీవలే అదానీ గ్రూప్‌‌ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. సోలార్ ఎక్విప్‌‌మెంట్ మాన్యుఫాక్చరింగ్‌‌ చేపట్టేందుకు ఈక్విటీ, స్ట్రాటజిక్ పార్టనర్లతో తమ గ్రూప్ చర్చలు జరుపుతున్నట్టు  గౌతమ్‌‌ అదానీ తెలిపారు. 25 గిగా వాట్ల సోలార్‌‌ విద్యుత్ ఉత్పత్తితో 2025 నాటికి ప్రపంచంలోనే లీడర్‌‌‌‌గా ఎదగాలని అదానీ గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా పెట్టుకుంది. అదానీ పవర్ థర్మల్ కెపాసిటీ18–20 గిగా వాట్లను ఇది మించిపోనుందని గౌతమ్ అదానీ తెలిపారు. ఎంఎన్‌‌సీలతో 50:50 జాయింట్ వెంచర్‌‌లలో తమది బెస్ట్ ట్రాక్ రికార్డని అదానీ చెప్పారు.‌‌ తాజాగా దక్కిన టెండర్‌‌‌‌తో గౌతమ్ అదానీ కంపెనీ కొత్తగా 4 లక్షల ఉద్యోగాలను సృష్టించబోతోంది.

‘90 శాతం చైనీస్ సోలార్ ఎక్విప్‌‌మెంట్ దిగుమతులు భవిష్యత్‌‌లో 50 శాతానికి పడిపోనున్నాయి. ఆ తర్వాత జీరోకు పడిపోతాయి. మూడు లేదా ఐదేళ్లలో అతి తక్కువ స్థాయిలకు ఈ దిగుమతులు దిగొస్తాయి’ అని అదానీ చెప్పారు. 25 గిగా వాట్ల ఉత్పత్తిని చేరుకోవడానికి ఫండ్స్  సేకరించే ప్లానింగ్‌‌లో ఉన్నట్టు చెప్పారు. 2022 నాటికి దేశంలో 175 గిగా వాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 నాటికి దీన్ని 450 గిగావాట్లకు పెంచాలనుకుంటున్నారు. ఈ టార్గెట్‌‌కు అనుకూలంగానే తమ గ్రూప్ ప్లానింగ్ ఉన్నట్టు అదానీ చెప్పారు. చైనాతో ఇండియన్ మాన్యుఫాక్చరింగ్‌‌ పోటీ పడనుందని పేర్కొన్నారు. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడకూడదని, స్వతహాగా ఎదగాలని ప్రపంచానికి కరోనా గుణపాఠం నేర్పిందని అదానీ చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

బతుకు భరోసా లేని జర్నలిస్టులు

ఒక్కొక్కరికీ 12 గంటల డ్యూటీ!