మీరు చాలా గ్రేట్: ఫోన్ లేకుండా 8 గంటలు గడిపి లక్ష గెల్చింది

మీరు చాలా గ్రేట్: ఫోన్ లేకుండా 8 గంటలు గడిపి లక్ష గెల్చింది

బీజింగ్: స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని ఈ రోజుల్లో.. ఏకంగా 8 గంటలపాటు మొబైల్​ను పక్కన పెట్టి చైనాకు చెందిన డాంగ్ అనే మహిళ లక్ష రూపాయలు గెలుచుకుంది. ఆ దేశంలోని చాంగ్ కింగ్ అనే మున్సిపాలిటీలోని ఓ షాపింగ్ మాల్ వారం కింద పెట్టిన కాంపిటేషన్​లో ఆమె ఈ ప్రైజ్ మనీ కొట్టేసింది. ఫోన్ వాడకుండా కూడా ప్రశాంతంగా గడిపేవారికి రూ.1.16 లక్షలు బహుమతి ఇస్తామని షాపింగ్ మాల్ ప్రకటించింది. ఫోన్లు, ల్యాప్​టాప్​లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఏమీ లేకుండా వాళ్లకు కేటాయించిన బెడ్స్​మీదే 8 గంటలపాటు గడపాల్సి ఉంటుంది.

టాయిలెట్​కు వెళ్లేందుకు 5 నిమిషాలు మినహా.. నిద్రపోవద్దు, ఆందోళన పడొద్దు, ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండాలని కండిషన్లు పెట్టింది. ఈ పోటీకి 100 అప్లికేషన్లు వచ్చాయి. అందులోంచి వడపోయగా ఎంపికైన 10 మంది పోటీలో పార్టిసిపేట్ చేశారు. భోజనం, చదువుకునేందుకు పుస్తకాలు అందుబాటులో ఉంచింది.ఆందోళనాస్థాయిని కొలిచేందుకు చేతి మణికట్టుకు సెన్సర్లు అమర్చింది.

ALSO READ : ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేయచ్చు.. రూ. 17 లక్షలు గెలిచే అవకాశం

అలా 10 మందిని 8 గంటలపాటు పరిశీలించిన తర్వాత అందరికంటే ఎక్కువ పాయింట్లు సాధించి.. డాంగ్ అనే మహిళ ప్రైజ్ మనీ గెలుచుకున్నట్లుగా ప్రకటించింది. డైలీ తన పిల్లలతోనే ఎక్కువ సమయం గడపడమే ఈ పోటీలో తనను విన్నర్​గా నిలిపిందని డాంగ్ పేర్కొంది.