బెంగళూరు: ఇండియాకు చెందిన షార్ట్ వీడియో షేరింగ్ యాప్ చింగారి సీడ్ రౌండ్ ఫండింగ్ ద్వారా 1.3 మిలియన్ డాలర్లను(రూ.9.74 కోట్లను) సేకరించింది. ఏంజిల్ లిసట్ ఇండియా, ఉత్సవ్ సోమా నిస్ ఐసీడ్, విలేజ్ గ్లోబల్, లాగ్‌ఎక్స్ వెంచర్స్ వంటి వెంచర్ క్యాపిటలిస్ట్ లు ఈఫండింగ్ లో పాల్గొన్నారని చింగారి తెలిపింది. ఈ ఫండింగ్ లో మరింత మందిని నియమించుకుని, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌ను పెంచుతామని తెలిపింది. మరింత కన్జూమర్ ఫోకస్డ్‌గా చింగారి ఉండనుందని పేర్కొంది. ఏంజిల్ లిస్ట్ ఇండియా, ఉత్సవ్ సోమానిస్ ఐసీడ్, విలేజ్ గ్లోబల్ వంటి ఇన్వెస్టర్లతో పనిచేయడం చాలా ఆనందదాయకంగా ఉందని చింగారి యాప్ సీఈవో సుమిత్ ఘోస్ అన్నారు.
For More News..