చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ లా కాదని..స్వదేశానికి చెందిన చింగారీ యాప్ లో క్రియేట్ చేసిన కంటెంట్ కు వచ్చిన వ్యూస్ ఆధారంగా మనీ ఎర్న్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
భారత్ లో చైనా కు చెందిన 59 యాప్ లను నిషేధం విధించిన విషయం తెలిసిందే. అందులో టిక్ టాక్ యాప్ కూడా ఉంది. అయితే టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా మన దేశానికి చెందిన చింగారీ యాప్ నెటిజన్లను ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. టిక్ టాక్ కు చెందిన సుమారు 200మంది ఇన్ ఇన్‌ఫ్లూయెన్సర్లు బెంగళూరుకు చెందిన ఈ చింగారీ ఫ్లాట్ ఫాంలోకి చేరినట్లు ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
యూజర్స్ ను అట్రాక్ట్ చేసేందుకు ఆన్ బోర్డింగ్ ను ప్రారంభించాము. ఇన్ స్టాగ్రామ్ , లేదా ఇతర ఫ్లాట్ ఫామ్ లలో చింగారి లో కంటెంట్ క్రియేట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఎక్కువ మంది కనిపిస్తారని, ఇలాంటి కంటెంట్ క్రియేటర్స్ లేదా ఇన్‌ఫ్లూయెన్సర్ల లను ఒకే ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు చింగారి యాప్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ సుమిత్ ఘోష్ తెలిపారు. ప్రస్తుతం చింగారిలో ప్రతీరోజు 5మిలియన్లమంది యాక్టీవ్ యూజర్స్ ఉన్నట్లు చెప్పారు. టిక్ టాక్ యూజర్లు ఎక్కడికి వెళ్లడం లేదని అందరూ చింగారి యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటున్నట్లు చెప్పిన సుమిత్ ఘోష్ ..టిక్ టాక్ లా వీడియోలే కాకుండా వీడియోలతో పాటు న్యూస్ ఫీడ్ ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తారో వారితో టై అప్ అవుతున్నామని, తద్వారా జాతీయ, అంతర్జాతీయ వార్తలను చింగారీ యాప్ లో చూడవచ్చన్నారు.
అంతేకాదు టిక్ టాక్‌లో ఇన్‌ఫ్లూయెన్సర్లు ఎలా మనీ ఎర్న్ చేస్తారో..చింగారీ యాప్ లో ఇన్‌ఫ్లూయెన్సర్లతో పాటు కంటెంట్ క్రియేటర్స్ మనీ ఎర్న్ చేయోచ్చని, కంటెంట్ కు వచ్చిన వ్యూస్ ఆధారంగా మనీ ఎర్న్ చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు, ఆ దిశగా యాప్ ను డెవలప్ చేస్తున్నట్లు చింగారీ యాప్ సహ వ్యవస్థాపకుడు సుమిత్ ఘోష్ స్పష్టం చేశారు.