ఆయుర్వేదం, నేచురోపతి వంటి పద్ధతులని.. అల్లోపతి కోసం పక్కన పెట్టడం సరికాదన్నారు ఆధ్యాత్మిక తత్వవేత్త చిన్నజీయర్ స్వామిజీ. HICCలో యశోద హాస్పటల్స్ ఆధ్వర్యంలో బ్రాంకస్ పేరుతో జరిగిన అంతర్జాతీయ పల్మనాలజీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. కరోనా టైంలో అల్లోపతి మందులకంటే ఎక్కువగా ఆనందయ్య మందే పనిచేసిందన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ కాన్ఫరెన్సన్ లో వివిధ దేశాలకు చెందిన డాక్టర్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నట్లు ఆర్గనైజర్స్ తెలిపారు.