తిరుపతి లడ్డు కల్తీ వివాదంపై స్పందించారు శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిజీ. లడ్డులో జంతువుల కొవ్వుతో తీసిన నెయ్యిని కలపడం దురదృష్టకరమన్నారు. కల్తీకి పాల్పడిన వ్యక్తులపైన, వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు చినజీయర్ స్వామి. శంషాబాద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలోని ఆడిటోరియంలో నిర్వహించిన వరల్డ్ హర్ట్ డే కార్యక్రమానికి చినజీయర్ స్వామి ముఖ్యఅతిధిగా హజరయ్యారు. గుండెపోటు వస్తే సీపీఆర్ ఎలా చేయాలి అనే దానిపై అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు చినజీయర్ స్వామిజీ.
ALSO READ | తిరుమల లడ్డూ వ్యవహరంపై సిట్ దర్యాప్తు వేగవంతం