రాజకీయాలు వేరైనా దేవుడి ముందు కలిసి రావాలి

రాజకీయాలు వేరైనా దేవుడి ముందు కలిసి రావాలి

రాజకీయాల్లో విభిన్న సిద్ధాంతాలు ఉన్నప్పటికీ.. భగవంతుడి వద్దకు అందరూ కలిసి రావాలని త్రిదండి చిన్నజీయర్ స్వామి పిలుపునిచ్చారు. శంషాబాద్ సమీపంలోని మచ్చింతల్ ఆశ్రయమంలో జరుగుతున్న శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన 216 అడుగుల రామానుజాచార్యుల (సమతా మూర్తి) విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం సమతా మూర్తి ప్రాంగణంలో ఉన్న 108 దివ్య దేశాలను దర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రివ్యూ థియేటర్ ను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ మాట్లాడుతూ.. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొనడం చాలా సంతోషం గా ఉందన్నారు. అమిత్ షా ఇక్కడికి వచ్చి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పారని అన్నారు. ఆయన అందరికీ ప్రేరణ ఇచ్చేలా ప్రసంగించారని అన్నారు. రాజకీయాల్లో విభిన్న సిద్ధాంతాలున్నప్పటికీ..  భగవంతుని వద్దకు రావడానికి అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

కాలేజీకి వెళ్లే యువతులకు ఫ్రీగా స్కూటీలు ఇస్తం

మంచు కొండలు విరిగిపడి.. ఏడుగురు సైనికుల మృతి