అలరించిన చిన్నారుల నృత్యాలు

అలరించిన చిన్నారుల నృత్యాలు

కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గవర్నమెంట్​ ప్రైమరీ స్కూల్​లో గురువారం రాత్రి యానివర్సరీ వేడుకలు నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన  నృత్యాలు చూపరులను అలరించాయి.  దేశ భక్తి, జానపద గేయాలు, విద్య వల్ల కలిగే ప్రయోజనాలపై నృత్య ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో ఎంఈవో  ఎల్లయ్య, హెచ్​ఎం హన్మండ్లు, టీచర్లు అరుణ్​జ్యోతి, శోభారాణి, శ్యామల, లావణ్య, శృతి, భార్గవి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.