
శ్రీరంగాపూర్, వెలుగు: మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఇఫ్తార్ విందు ఆరగించారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజేంద్రప్రసాద్ యాదవ్, రాములుయాదవ్, ముస్లిం మత పెద్దలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.