జగన్ 5వేల కోట్లు ఖర్చు చేసినా ఓట్లన్నీ చంద్రబాబుకే.. చింతా మోహన్

తెలుగు రాష్ట్రాల్లో 2024సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ముఖ్యంగా ఏపీలో ఈసారి ఎన్నికలు ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగాయి. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులకు ఈ ఎన్నికల్లో గెలవటం కీలకం కావటంతో ఇద్దరూ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గెలుపు తమదే అంటూ ఇరువర్గాల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిదే అధికారమని అన్నారు.ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతాయని అన్నారు చింతా మోహన్. ఈ ఎన్నికల కోసం వైసీపీ వేల కోట్లు డబ్బులు ఖర్చు చేసిందని, అంత డబ్బు ఎలా వచ్చిందో చెప్పాలని అన్నారు.గెలుపుపై వైసీపీ ఊహల్లో ఉందని, అధికారం టీడీపీ కూటమిదేనని అన్నారు చింతా మోహన్. వైసీపీ 5వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ జగన్ కు పడాల్సిన ఓట్లన్నీ చంద్రబాబుకే పడ్డాయని అన్నారు.