నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా : చింతా ప్రభాకర్

కంది, వెలుగు :  నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి 16 అంశాలతో కూడిన మేనిఫేస్టో రిలీజ్​చేశానని, తాను గెలిచిన వెంటనే ఒక్కొక్కటి పూర్తి చేస్తానని  బీఆర్ఎస్ సంగారెడ్డి​అభ్యర్థి చింతా ప్రభాకర్​ అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని పలు వార్డులతో పాటు కంది మండలం ఓడిఎఫ్​, ఇంద్రకరణ్​ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పుడప్పుడు వచ్చి అంగట్లో కూరగాయలు అమ్ముకుని పోయే వాళ్లలాగా వచ్చి పోయే వారికి ఓటువేసి మోసపోవద్దని సూచించారు.  

గెలిచినా, ఓడినా ఎవరు అందుబాటులో ఉంటారనే విషయాన్ని గమనించాలన్నారు.  తాను గత ఎన్నికల్లో  ఓడినా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలే తన సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే నియోజకవర్గంలో మెడికల్​కాలేజీ, నర్సింగ్​ కాలేజీలు వచ్చాయన్న సంగతి గుర్తుచేశారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తానని ప్రజలను అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, బుచ్చిరెడ్డి , వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు సోహెల్ ఆలీ, నక్క మంజులత నాగరాజ్​గౌడ్, పవన్​నాయక్, బొంగులరవి, గోవర్ధన్​నాయక్​, నర్సింగ్​రావు , బీరయ్య యాదవ్, శ్రీహరి,  వివిధ వార్డుల కౌన్సిలర్లు,  బీఆర్‌‌ఎస్​ నాయకులు, కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.