ఏపీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు నామినేషన్

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. ఆయన తరుపున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు,  సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. రేపు అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ  స్పీకర్ ఎన్నిక జరగనుంది.  మరోవైపు ఏపీ శాసనసభ రేపటికి వాయిదా పడింది. జూన్ 21వ తేదీ శుక్రవారం గెలిచిన 175 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.  సభ్యులతో ప్రమాణం చేయించారు  పొట్రెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య.  చింతకాయల అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 24,676 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన ఏడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.. అయ్యన్నాపాత్రుడు 1982లో పార్టీ ఆవిర్భావ సమయం నుంచి తెలుగు దేశం పార్టీలో ఉన్నారు.