డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఫ్లెక్సీల కలకలం

కరీంనగర్ : కరీంనగర్ పట్టణం సమీపంలోని చింతకుంట గాంధీనగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ‘డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అంటూ పోలీసులు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 

మరోవైపు.. పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి కౌంటర్ గా డబుల్ బెడ్రూం బాధితుల సంఘం కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ‘పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ..మాట తప్పింది. వారం రోజుల్లో ఇండ్లు పంపిణీ చేయకపోతే మోసం చేసిన ఎమ్మెల్యేకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రెండు ఫ్లెక్సీలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.