హైదరాబాద్, వెలుగు: అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా చింతల రవీంద్రనాథ్ యాదవ్ నియమితులయ్యారు. ఇటీవల జైపూర్ లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వపన్ కుమార్ ఘోష్, జాతీయ ప్రధాన కార్యదర్శి (దక్షిణ భారత ఇన్ చార్జ్) ఆర్.లక్ష్మణ్ యాదవ్ నిర్ణయం మేరకు నియామక పత్రాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి బల్బీర్ సింగ్ యాదవ్ అందించారని తెలిపారు.
ఈ సందర్బంగా రవీంద్రనాథ్ యాదవ్ మాట్లాడారు. తనసేవలను గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంపై జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యాదవ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాదవులందరిని కలుపుకుని వారి అభివృద్ధికి కృషి చేస్తానని వివరించారు. సదర్ పండగను రాష్ట్రపండుగగా గుర్తించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు స్థానం కల్పించాలని, రాబోయే ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.