
కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి మండలం కార్రెబ్బెన ప్రాథమిక పాఠశాలలో స్టూడెంట్స్ తాగునీటికి గోస పడుతున్నారు ఉదయం11 గంటల సమయంలో ఇద్దరు స్టూడెంట్స్ బోర్వెల్ వద్ద నీళ్లు నింపుకొని మోసుకురావడం కనిపించింది. నీటిని నింపడానికి అయిదు నిమిషాలు ఎండలో విద్యార్థులు ఆపసోపాలు పడ్డారు. పిల్లలతో ఎందుకు నీళ్లు మోపిస్తున్నారని స్థానికులు టీచర్ ను ప్రశ్నించడంతో స్కావెంజర్ రాలేదని పిల్లలే నీళ్లు తెచ్చుకుంటున్నారని చెప్పడం గమనార్హం.