
మాజీ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు చింతమడక గ్రామస్తులు బయలుదేరారు. 540 మంది చింతమడక గ్రామస్తులు సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లేందు ప్రయత్నంచారు. అయితే ఈ క్రమంలో వారిని చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆపి.. ఎందుకు మీరంతా.. ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ని కలసి... ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నామని గ్రామస్తులు తెలిపారు.
దీంతో తమకు దీనికి సంబంధించిన సరైనా సమాచారం వచ్చే వరకు మిమ్మల్ని లోపలికి పంపించబోమని పోలీసులు చెప్పారు. దీంతో గ్రామస్తులంతా కేసీఆర్ పిలుపు కోసం రోడ్డుపై వెయిట్ చేస్తున్నారు.
Also Read:-మంత్రి పదవి వచ్చినా, రాకపోయినా ప్రజలకు సేవ చేస్త : వివేక్ వెంకటస్వామి