దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల పెదవేగి పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసిన చింతమనేని తన అనుచరులతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పెదవేగి పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తమతో పాటు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తీసుకెళ్లారు. దీంతో చింతమనేనితో పాటు ఆయన అనుచరులు మొత్తం 18 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం వీరిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు.
చింతమనేని కోసం హైదరాబాద్, బెంగళూరులకు ప్రత్యేక బృందాలను పంపారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకునేంత వరకు గాలింపు కొనసాగుతుందని తెలిపారు పోలీసులు. కాగా, సమస్యాత్మక ప్రాంతమైన డెందళూరులో కౌంటింగ్ రోజున అల్లర్లు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు ఏజెంట్లుగా ఉన్నవారి పూర్తీ వివరాలు సేకరిస్తున్నామని, కౌంటింగ్ తర్వాత క్రాకర్స్ కాల్చటం, బాటిళ్లలో పెట్రోల్ అమ్మకంపై నిషేధం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.