![చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తా](https://static.v6velugu.com/uploads/2022/09/chintha-prabhakar-take-charge-as-chairman-of-telangana-state-handloom-corportation_EGwio7VTZc.jpg)
తెలంగాణ హ్యాండ్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు, ఈ సందర్భంగా చింతా ప్రభాకర్‌కు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.
అనంతరం చింతా ప్రభాకర్ మాట్లాడుతూ... చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్‌కు చేనేత కార్మికుల సమస్యలు తెలుసని, బీసీల అభ్యున్నతికి తెలంగాణ ఫ్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. హ్యాండ్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా చింతా ప్రభాకర్‌ను సీఎం కేసీఆర్ ఈ నెల 13న నియమించారు. రెండేండ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.