కాగజ్ నగర్‌‌లో ఐదు కేసుల్లో 19 మంది రిమాండ్

కాగజ్ నగర్‌‌లో ఐదు కేసుల్లో 19 మంది రిమాండ్

కాగజ్ నగర్, వెలుగు: అక్రమ దందాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల మీద చింతలమనేపల్లి పోలీసులు  ఒకేరోజు 5 కేసులు నమోదు చేశారు. ఎస్ఐ ఇస్లావత్ నరేశ్ అధ్వర్యంలో మండలంలో పేకాట, గుడుంబా స్థావరాలపై మెరుపు దాడులు చేయడంతో పాటు, మహారాష్ట్రకు అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం పట్టుకుని కేసులు నమోదు చేశారు. బాబాసాగర్ శివారులో రహస్యంగా పేకాట ఆడుతున్న 10 మందిని పట్టుకుని రూ.2360 నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.

 డబ్బా గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకొని రూ.2140 స్వాధీనం చేసుకున్నారు. గూడెం మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలించడానిని సిద్ధంగా ఉన్న 2 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని షేక్ నయుద్దిన్ పై కేసు నమోదు చేశారు. కర్జవెల్లి నుంచి గూడెం వైపు తీసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న 55 లీటర్ల గుడంబాను పట్టుకొని చౌదరి అంకులు, చౌదరి మదునయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మొత్తం 5 కేసుల్లో 19మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.