చింతలపాలెం కాంగ్రెస్ నాయకుల్ని వేధిస్తున్నరు

మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు : అధికార పార్టీ లీడర్లు కాంగ్రెస్ నాయకులను వేధిస్తున్నారని చింతలపాలెం కాంగ్రెస్ లీడర్లు ఆరోపించారు. గురువారం చింతలపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో వారు మాట్లాడారు. కొత్తగూడెం తండాలో జరిగిన ఘర్షణల వెనుక బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తలను వేధించడం తగదన్నారు. 

ALSO READ : Telangana Tour : ఈ వీకెండ్ మంచిర్యాల చూసొద్దామా.. మంచిగుంటది

అభివృద్ధి మొత్తం ఉత్తమ్ హయాంలోనే జరిగిందని, ఇప్పుడున్న పాలకులు అవినీతి తప్ప అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కొండారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంద్రారెడ్డి, జానిమియా, హుస్సేన్, నరేందర్ రెడ్డి, సురేందర్, రాజశేఖర్ రెడ్డి, సౌమ్య, ప్రభాకర్ రెడ్డి, వెంకయ్య, వెంకటరెడ్డి, నాగుల్ మీరా, బాజీ, సైదులు, నాగరాజు ఉన్నారు.