విదేశాల్లో ఆగని భారతీయ విద్యార్థుల హత్యలు.. కెనడాలో మరో హత్య

పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ పై వరుసగా దాడులు జరుగుతున్నాయి. అబ్రాడ్ వెళ్లిన భారతీయ విద్యార్థులపై దాడులు, హత్యలు ఇలా నెలకొక వార్త వినిపిస్తోంది. కెనడాలోని వాంకోవర్ లో ఏప్రిల్ 12న చిరాగ్ ఆంటిల్(24) అనే ఇండియన్ స్టూడెంట్ ని గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో గన్ పేల్చిన సౌండ్ రావడంతో ఇంటి చుట్టుపక్కట వారు వెళ్లి చూశారు.

చిరాగ్ కారులో బులెట్ గాయాలతో చనిపోయి ఉన్నాడు. పొరుగువారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కెనడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు. దాడికి గల కారణాలు తెలియదని మృతుడి సోదరుడు రోమిత్ ఆంటిల్ చెప్పాడు. ఈవారంలో చిరాగ్ మృతదేహానికి పోస్టుమార్టం చేస్తామని పోలీసులు తెలిపారు.