అండర్‌‌‌‌-23 వరల్డ్‌‌‌‌ రెజ్లింగ్‌‌‌‌లో..చిరాగ్​కు గోల్డ్​

అండర్‌‌‌‌-23 వరల్డ్‌‌‌‌ రెజ్లింగ్‌‌‌‌లో..చిరాగ్​కు గోల్డ్​

టిరాన(అల్బేనియా) : ఇండియా యువ రెజ్లర్‌‌‌‌ చిరాగ్‌‌‌‌ చిక్కార ప్రతిష్టాత్మక అండర్‌‌‌‌-23 వరల్డ్‌‌‌‌ రెజ్లింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఇండియా నుంచి ఈ ఘనత సాధించిన మూడో రెజ్లర్‌‌‌‌‌‌‌‌గా రికార్డుకెక్కాడు.  మెన్స్‌‌‌‌ ఫ్రీ స్టయిల్ 57 కేజీ విభాగంలో చిరాగ్‌‌‌‌ గోల్డ్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో చిరాగ్ 4-–3తో కిర్గిస్తాన్‌‌‌‌కు చెందిన అబ్దిమాలిక్‌‌‌‌ ఖరచోవ్‌‌‌‌ను ఓడించి అండర్‌‌‌‌‌‌‌‌ 23 వరల్డ్ చాంపియన్‌‌‌‌గా నిలిచాడు. దాంతో  పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత  అమన్‌‌‌‌ సెహ్రావత్‌‌‌‌,  రీతికా హుడా సరసన నిలిచాడు.

2022లో 57 కేజీ కేటగిరీలోనే అమన్ సెహ్రావత్‌‌‌‌ గోల్డ్ నెగ్గగా..గతేడాది రీతికా చాంపియన్‌‌‌‌గా నిలిచింది. మెన్స్‌‌‌‌ ఫ్రీ స్టయిల్‌‌లో చివరి రోజు ఇండియాకు మరో రెండు కాంస్యాలు లభించాయి. సెమీస్‌‌‌‌లో ఓడి ఫైనల్ బెర్తు కోల్పోయిన సుజీత్ కల్కల్ 70 కేజీ ల్లోలో కాంస్యంతో తిరిగొచ్చాడు. ప్లే ఆఫ్​ బౌట్‌‌లో ఓ దశలో 0–4తో వెనుకంజ వేసిన సుజీత్‌‌‌‌ అద్భుతంగా పుంజుకొని 13–4 తేడాతో ముస్తఫో అఖ్మెదొవ్‌‌‌‌ (తజికిస్తాన్‌‌‌‌)పై విజయం సాధించాడు. మెన్స్‌‌‌‌ 97 కేజీ కాంస్య పతక పోరులో విక్కీ 7–2 తేడాతో ఇవాన్ ప్రైమచెంకో (ఉక్రెయిన్‌‌‌‌)ను ఓడించాడు.   మొత్తంగా తొమ్మిది పతకాలతో ఇండియా ఈ టోర్నీని ముగించింది.