ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌.. చిరాగ్ చిక్కారాకు గోల్డ్ మెడల్

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌.. చిరాగ్ చిక్కారాకు గోల్డ్ మెడల్

ఆల్బేనియా వేదికగా జరుగుతున్న అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌‌లో భారత యువ రెజ్లర్ చిరాగ్ చిక్కారా స్వర్ణం సాధించాడు. సోమవారం(అక్టోబర్ 28) జరిగిన మెన్స్ 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో చిరాగ్.. కిర్గిజ్‌స్థాన్‌ రెజ్లర్ అబ్దిమలిక్ కరాచోవ్‌పై  4-3 తేడాతో విజయం సాధించి పసిడిని ముద్దాడాడు. ఆఖరి వరకూ నువ్వా.. నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో భారత రెజ్లర్ చివరి సెకన్లలో గెలుపును అందుకున్నాడు.

ఈ పసిడితో చిరాగ్ చిక్కారా మరో ఘనతను అందుకున్నాడు. అండర్-23 విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన మూడో భారతీయుడిగా నిలిచాడు. అంతకుముందు అమన్ సెహ్రావత్(మెన్స్ 57 కేజీ ఫ్రీస్టైల్), రీతికా హుడా(ఉమెన్స్ 76 కేజీ ఫ్రీస్టైల్) ఈ ఘనత సాధించారు.

ఈ టోర్నీని భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఏడు కాంస్యాలు.. మొత్తం తొమ్మిది పతకాలతో సగర్వంగా ముగించింది.