ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ జోడి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడి ఫైనల్కు దూసుకెళ్లింది. BWF వరల్డ్ సిరీస్ సూపర్ 750 మెన్స్ డబుల్స్ భాగంగా జరిగిన సెమీస్లో సాత్విక్ చిరాగ్ జంట..21-18,21--14 స్కోరు తేడాతో కొరియా జోడిపై ఘన విజయం సాధించింది.
ఆద్యంతం..ఆధిపత్యం...
45 నిమిషాల పాటు సాగిన సెమీస్లో సాత్విక్ చిరాగ్ జోడి..ప్రత్యర్థిపై ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. హోరా హోరీగా సాగిన తొలి సెట్లో కొరియా ద్వయం చోయ్ సోల్ గ్యు-కిమ్ వాన్ హోపై అద్భుతమైన షాట్లతో విరుచుపడింది. అయితే కీలక సమయంలో ప్రత్యర్థి జోడి పుంజుకోవడంతో...గేమ్ ఆసక్తిగా మారింది. చివర్లో సాత్విక్ చిరాగ్ జోడి..మెరుగ్గా ఆడి తొలి గేమ్ను సొంతం చేసుకుంది. ఇది దూకుడును రెండో గేమ్లోనూ కనభర్చారు. తొలి గేమ్తో కొరియా జంట పోరాడినా..రెండో గేమ్లో మాత్రం సాత్విక్ చిరాగ్ జోడి జోరుకు చేతులెత్తేశారు. దీంతో 14-21తో ఓడిపోయారు.
రెండో టైటిల్ సాధిస్తారా...
2022లో సాత్విక్ చిరాగ్ జోడి BWF వరల్డ్ టూర్ టోర్నీలో ఫైనల్ చేరడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో ఈ జంట ఇండియా ఓపెన్ సూపర్ 500 టోర్నీలో ఫైనల్ చేరి టైటిల్ను దక్కించుకుంది. మరి BWF వరల్డ్ సిరీస్ సూపర్ 750 ఫ్రెంచ్ ఓపెన్లోనూ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.