ఇంకెందుకు లేటు అంటూ.. చిరు సినిమా అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి..

ఇంకెందుకు లేటు అంటూ.. చిరు సినిమా అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి..

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత సాహూ గారపాటి నిర్మిస్తున్నాడు. అయితే ఈ ఏడాది "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇదే ఊపులో మరో సాలిడ్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే చిరు కోసం సాలీడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో కథని రెడీ చేశాడు.. ఈ విషయం గురించి అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఇందులో భామగాభాగంగా " చిరంజీవిగారితో తో చేస్తన్న సినిమా స్టోరీ నేరేషన్ పూర్తయింది. చిరంజీవి గారికి నా కధ లో పాత్ర “శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను .. కథని చాలా ఎంజాయ్ చేశారు. ఇంకెందుకు లేటు, త్వరలో ముహూర్తంతో… ‘చిరు’ నవ్వుల పండగబొమ్మ కి శ్రీకారం" అంటూ సెలబ్రేషన్ ఎమోజీలు షేర్ చేశాడు. దీంతో చిరు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి పాత్రకి ఆయన అసలు పేరుని ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చిరు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆగస్టులో అనిల్ రావిపూడి సెట్స్ మీదకి వేళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ ఉగాది పండుగ రోజున ముహూర్తం, పూజ కార్యక్రమాలు జరగనున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ విషయం ఇలా ఉండగా ఈమధ్య చిరు ఎక్కువగా యంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తున్నాడు. అలాగే కథల ఎంపికల విషయంలో కూడా గేర్ మార్చినట్లు సమాచారం.. అయితే ప్రస్తుతం చిరు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట డైరెక్ట్ చేస్తున్న విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఈ నెల చివరికి పూర్తవుతుంది. దీంతో దీంతో జూన్ లేదా జులై లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక చిరు మరో యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా బ్లడ్ & యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు సమాచారం.