మెగాస్టార్ సినిమా కోసం ఫిల్మ్ నగర్ లో సెపరేట్ గా ఆఫీస్ తీశారట..

మెగాస్టార్ సినిమా కోసం ఫిల్మ్ నగర్ లో సెపరేట్ గా ఆఫీస్ తీశారట..

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు టాలీవుడ్ లో ఇప్పటివరకూ అనిల్ రావిపూడి 8 సినిమాలు చేయగా కనీసం ఒక్క ఫ్లాప్ లేకుండా 100% శాతం హిట్ రేషియాతో ఉన్నాడు. ఇటీవలే ప్రముఖ హీరో వెంకటేష్ హీరోతో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా దాదాపుగా రూ.300 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ప్రస్తుతం అనిల్ రావిపూడి కి టాలీవుడ్ లో డిమాండ్ పెరిగింది. అయితే అనిల్ మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవితో చేస్తున్న సినిమా స్టోరీ నేరేషన్ పూర్తి కాగా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని గతంలో అనిల్ రావిపూడి తీసిన భగవంత్ కేసరి సినిమాని నిర్మించిన ప్రముఖ తెలుగు సినీ నిర్మాత సాహూ గారపాటి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం మేకర్స్ సెపరేట్ గా ఫిలిం నగర్ లో ఆఫీస్ ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

ALSO READ | Pattudala Review: మూవీ రివ్యూ.. యాక్షన్లో పట్టుదల చూపించిన అజిత్ కుమార్

అన్నీ కుదిరితే ఏప్రిల్ లో చిరు-అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడితో సినిమా కన్ఫర్మ్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లెజెండరీ యాక్టర్ తో 100% సక్సస్ ఉన్న డైరెక్టర్ తో సినిమా అంటే ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అలాగే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా మెగాస్టార్ చిరు ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల షూటింగ్ పూర్తికాక పోవడంతో సమ్మర్ కి వాయిదా పడింది.