Chiranjeevi: మొదలైన చిరు-అనిల్ రావిపూడి సినిమా.. వెంకీ మామ కూడా వచ్చాడుగా..

Chiranjeevi: మొదలైన చిరు-అనిల్ రావిపూడి సినిమా.. వెంకీ మామ కూడా వచ్చాడుగా..

ఈ ఏడాది ఆరంభంలో "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమా ఈరోజు హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని స్టార్ట్ అయ్యింది. ఈ పూజా సెర్మనీకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిరుని విష్ చేశారు. 

ఇందులోభాగంగా హీరో విక్టరీ వెంకటేష్, దర్శకులు రాఘవేంద్రరావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్‌ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్‌  అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్‌ రాజు, నాగవంశీ, తదితరులు వచ్చారు.

ఈ విషయం ఇలా ఉండగా ఈ సినిమాని యంగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. అయితే చిరు కోసం అనిల్ రావిపూడి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ లో స్టోరీ ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరు శంకర్ వర ప్రసాద్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరుకి ఎలాంటి హిట్ ఇస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.