టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నాడని గతవారం రోజులుగా సోషల్ మీడియాలో పలు వార్తలు బలంగా వైరల్ అవుతన్నాయి. దీంతో ఈ విషయంపై చిత్ర యూనిట్ లేటస్ట్ అప్డేట్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేశారు. ఈ విషయాన్ని నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా ద్వారా అభిమాలతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా చిన్నప్పటినుంచి చిరంజీవిగారిని చూస్తూ ఇన్స్పిరేషన్ గా తీసుకుని పెరిగానని, అలాంటిది ఇప్పుడు తన అభిమాన హీరో నటిస్తున్న సినిమాని నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అలాగే శ్రీకాంత్ ఓదెలతో కలసి ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్దమవుతున్నామని తెలిపాడు.
చిరంజీవి కూడా నాని తో కొలాబరేట్ అవడం థ్రిల్లింగ్ గా ఉందని రిప్లై ఇచ్చాడు. ఈ సందర్భంగా చిరంజీవి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రక్తంతో తడిసిన చెయ్యి కనిపిస్తోంది. దీంతో ఈ సినిమాలో చిరు పాత్ర మోస్ట్ వైలెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి తెలుగులో విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి బింబిసార మూవీ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. దీంతో విశ్వంభర సినిమా షూటింగ్ పూర్తవగానే చిరు-శ్రీకాంత్ ఓదెల సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
Thrilled at this collaboration and looking forward to this one my dear @NameisNani 🤗@odela_srikanth#ChiruOdelaCinema
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 3, 2024
Natural Star @NameisNani @UnanimousProd@sudhakarcheruk5 @SLVCinemasOffl https://t.co/AGfKjrwjDL