మెగా బ్లడ్ ప్రామిస్: అల్లకల్లోలం సృష్టించేందుకు సిద్దమైన చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల

మెగా బ్లడ్ ప్రామిస్: అల్లకల్లోలం సృష్టించేందుకు సిద్దమైన చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తో సినిమాని ప్రకటించి కొత్త ఉత్సాహంతో ఉన్నాడు చిరు. అనూహ్యమైన ఈ వైల్డ్ కాంబినేషన్కి మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తాజాగా మెగా 'బ్లడ్ ప్రామిస్' అంటూ శ్రీకాంత్ ఓదెల చిరుతో దిగిన ఫోటోని షేర్ చేశాడు. ఈ కాంబో 'తీవ్ర హింసాత్మకంగా' ఉంటుందనే ట్యాగ్ జోడించారు.

ఈ లేటెస్ట్ పోస్టర్లో చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కలిసి చేతులను బిగించి రక్తంతో ఉన్న స్టిల్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందుకు తోడు చిరు నా హీరో, ఆయనతో సినిమా చేయడం నా కల అని చాలాసార్లు డైరెక్టర్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఇక ఒక అభిమానిగా చిరుని ఎలా చూపించనున్నాడో ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఇక ఫ్యాన్ భాయ్ తాండవం మొదలైనట్టే!

మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకొని బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టాడు ఈ కుర్ర దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్నితనవైపుకు తిప్పుకున్నాడు. ప్రస్తుతం నానితో ఓ మూవీ చేస్తున్నాడు. దాని తర్వాత చిరు ప్రాజెక్ట్ను తెరకెక్కించనున్నాడు.