NBK 50 Years Event: ఘనంగా NBK50 ఇయర్స్ వేడుకలు..బాలయ్యతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చిరు, వెంకటేష్

నందమూరి బాలకృష్ణ (NBK) నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ (NBKGoldenJubilee Celebrations) వేడుకలను తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఘనంగా నిర్వహించారు.

ఆదివారంసెప్టెంబరు 1న హైదరాబాద్‌ నోవాటెల్‌లో జరిగిన బాలకృష్ణ 50 ఇయర్స్‌ సెలబ్రేషన్స్‌ లో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.ఈ వేడుకలో ప్రసంగించిన సినీయర్ హీరో విక్టరీ వెంకటేష్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, మంచు మోహన్ బాబు, నటి సుమలత ఏమన్నారో వారిమాటల్లో..

ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ..'ఎన్టీఆర్ గారి కుటుంబం నుండి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు బాలయ్య బాబు. ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. 50 సంవత్సరాల నీ ప్రయాణం ఎంతో మంది కొత్త వారికి ఆదర్శం. ‘ఫ్లూట్ జింక ముందు కాదు, సింహం ముందు కాదు.’అని వెంకీ మామ అన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ..‘‘బాలయ్యబాబు 50 సంవత్సరాల వేడుకలో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది బాలకృష్ణకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుక. అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్‌కు ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కుమారుడిగా బాలకృష్ణ తండ్రి చేసిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు ఆయనకు ఇదే శక్తిని ఇస్తూ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.’’ అని అన్నారు.

మోహన్‌ బాబు మాట్లాడుతూ.. ‘‘బాల్యం నుంచీ నటుడిగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వచ్చారు బాలయ్య. 500 రోజులకుపైగా సినిమా ప్రదర్శితమవడమనే ఘనత ఆయనదే. హిందూపురం ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలవడం సంతోషం. మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’అని అన్నారు. 

నాని మాట్లాడుతూ..‘‘బాలకృష్ణను కలవడమే కాదు ఆయన్ను దగ్గరగా చూసినా ఇష్టపడతాం. సర్‌..మీరు ఇలాగే మరో 100 చిత్రాలు చేయాలి’’  

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ..బాలయ్య బాబు గారి గురించి మాట్లాడటం అదృష్టం అనుకోవాలి. ఆయన గురించి డైలాగ్స్ రాయాలంటే బాలయ్య గారి నుంచే పుట్టేస్తాయ్, బాడీ లాంగ్వేజ్ నుంచి వచ్చేస్తాయి. నటుడు, రాజకీయ నాయకుడు, మానవత్వం ఉన్న మనిషి ఇలా అనేక రూపాల్లో ఉండటం ఆయనకే సాధ్యం’’.. 

‘‘రికార్డులు బద్దలు కొడుతూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాలయ్య గారికి శుభాకాంక్షలు. మిమ్మల్ని చూస్తూ పెరిగాం, మీరే మా స్ఫూర్తి. కుటుంబంతో ప్రేమగా మెలగడంలో, వయసు పెరుగుతున్న కూడా తరానికి తగ్గట్లు మారడంలో మీరు మాకు ఒక ఆదర్శం’’ అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు.

ఇకపోతే..ఈ NBK50 ఇయర్స్ వేడుకలో యంగ్ హీరోస్ నాని,సిద్దు జొన్నలగడ్డ,అడవి శేష్,మంచు మనోజ్,మంచు విష్ణు, విజయ్ దేవరకొండ, అల్లరి నరేష్,శివ బాలాజీ వంటి తదితర నటులు పాల్గొని బాలయ్య పైన ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.