మెగాస్టార్ చిరంజీవికి(Megastar chiranjeevi) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో, డాన్సులతో కొన్ని కోట్లమంది అభిమానులను సొంతం చేసుకొని వారి గుండెల్లో మెగాస్టార్ గా నిలిచిపోయారు. ఈ ప్రయాణంలో ఆయన సాధించిన విజయాలు, అందుకున్న అవార్డులు ఎంతో మందికి ఆదర్శం.
ఇండియా నుండి ఒక్కో సినిమాకు రూ.50 నుండి రూ.100 కోట్ల వరకు తీసుకొనే మోస్ట్ ఎక్స్పెన్సీవ్ యాక్టర్లలో అయన ఒకరు. అందుకే మోస్ట్ లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు ఆయన. అంతేకాదు చిరంజీవికి కార్లంటే ఆసక్తి ఎక్కువ. ఆయన గ్యారేజీలో విదేశీ బ్రాండ్స్ బ్రిటన్, జర్మన్ బ్రాండ్ కార్లు కూడా ఉన్నాయి. వాటి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.
రోల్స్ రాయిస్ ఫాంతమ్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఫాంటమ్ ఒకటి చిరంజీవి గ్యారేజిలో ఉంది. దీని ధర దాదాపు రూ.8 కోట్లు వరకు ఉంటుంది. ఈ కారుని చిరంజీవి 53వ పుట్టినరోజున ఆయన కుమారుడు రామ్ చరణ్ గిఫ్ట్‌గా ఇచ్చారట.
టయోటా ల్యాండ్ క్రూజర్
చిరంజీవి గ్యారేజిలో టయోటా బ్రాండ్ కు సంబందించిన రెండు ల్యాండ్ క్రూజర్ కార్లు ఉన్నాయి. సేఫ్టీకి ప్రసిద్ధి చెందిన ఈ కారు ధర సుమారు రూ. 1 కోటి కంటే ఎక్కువే ఉంటుందట.
రేంజ్ రోవర్ వోగ్
ల్యాండ్ రోవర్ కంపెనీకి రేంజ్ రోవర్ వోగ్ కూడా మెగాస్టార్ గ్యారేజిలో ఉంది. దీని ధర కూడా రూ.1 కోటి వరకు ఉంటుంది. చిరంజీవి సాధారణంగా హైదరాబాద్ లో ఎక్కడికైనా వెళ్ళడానికి ఈ కారునే ఎక్కువగా ఉపయోగిస్తారని టాక్.
టొయోటా వెల్ఫీర్
ఇక చిరంజీవి గ్యారేజ్ లో ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో టొయోటా వెల్ఫీర్ ఒకటి. దీని ధర కూడా సుమారు రూ.1 కోటి రూపాయల వరకు ఉంటుంది.
అంతేకాదు చిరంజీవి దగ్గర అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దీని ఖరీదు దాదాపు రూ.250 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.