పుట్టినరోజున మనవరాలితో.. వైరలవుతున్న చిరు, క్లింకార ఫొటో

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన మనవరాలు క్లింకార(Klinkaara)తో ఆడుకుంటున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 22 ఆయన పుట్టినరోజు సంధర్బంగా ఆయనకు విశేష్ తెలియజేస్తూ మెగా కోడలు ఉపాసన(Upsana) ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలిని ఎత్తుకొని కనిపించారు. అయితే ఈసారి కూడా ఫోటోలో క్లింకార మొహం కనిపించకుండా లవ్ ఎమోజీతో కవర్ చేశారు. చాలా క్యూట్ గా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనవరాలు తమ ఇంట అడుగుపెట్టిన తరువాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో చాలా సంతోషంగా ఉన్నారట చిరు.

ఇక జూన్ 20న రామ్ చరణ్ ఉపాసన దంపతులకు క్లింకార జన్మించిన విషయం తెలిసిందే. చాలా కాలంగా ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న మెగా కుటుంబంలో క్లింకార రాకతో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక పాప పుట్టి రెండు నెలలు గడుస్తున్నా.. మీడియాకు మాత్రం పాపను చూపించలేదు మెగా ఫ్యామిలీ. దీంతో మెగా వారసురాలు ఎలా ఉందొ అని చూడటానికి ఫ్యాన్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.