Video Viral:'ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే'.. అమ్మ అంజ‌నాదేవి బర్త్డే వేడుకలో చిరు సందడి

Video Viral:'ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే'.. అమ్మ అంజ‌నాదేవి బర్త్డే వేడుకలో చిరు సందడి

'ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే' అని ఉరికే అనరు కదా పెద్దలు. ఇప్పుడలాంటి అమ్మ ప్రేమలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). బుధవారం జనవరి 29న చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ అంత పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు.

ఈ నేపథ్యంలో అమ్మ పుట్టిన‌రోజును అంజ‌నీపుత్రుడు చిరంజీవి ఎంత వైభ‌వంగా జ‌రుపుకున్నారో వీడియో చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది. మెగా కుటుంబంలో హీరోలు ఎంతమంది ఉన్న.. వారి ఫ్యామిలీకి బలం, ధైర్యం అంజనాదేవి. కుటుంబ విలువలు, ఓర్పు, సహనం, క్రమశిక్షణ వంటి విషయాలు ఆమె నుంచి నేర్చుకోవాలని ఎప్పుడు చెబుతూ వస్తారు చిరంజీవి. 

Also Read : నాగ చైతన్యకి పోటీగా రానున్న

లేటెస్ట్గా చిరు తనలో ఉన్న అమ్మ ప్రేమను చూపిస్తూ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో చూడటానికి రెండు కళ్లు చాలవేమో అన్నట్టుగా ఉంది.

''అమ్మా.. మేము నిన్ను మాటలకు మించి ప్రేమిస్తున్నాము. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా గౌరవిస్తాము. ఈ స్పెష‌ల్ డే సంద‌ర్భంగా మీకు ఇదే విష‌యం చెప్పాలనుకుంటున్నాము'' అని చిరు ఈ వీడియోకు అంద‌మైన‌ పదాలను జోడించారు.ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో మెగా ఫ్యాన్స్ చిరంజీవి తల్లి అంజనా దేవి అమ్మ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.