గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు తరహాలో చిరు అనిల్ రావిపూడి సినిమా

గ్యాంగ్ లీడర్,  ఘరానా మొగుడు తరహాలో చిరు అనిల్ రావిపూడి సినిమా

మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్స్‌‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  కథకు ప్రాధాన్యత ఉండాలే తప్ప.. సీనియారిటీతో పనిలేదు అన్నట్టుగా వరుసగా యువ దర్శకులతో సినిమాలు చేయడానికి సై అంటున్నారు.  ఇప్పటికే వశిష్ట డైరెక్షన్‌‌లో  ‘విశ్వంభర’ చేస్తున్న చిరంజీవి.. ఇటీవల ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతోనూ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. అలాగే అనిల్  రావిపూడితోనూ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

అయితే ‘విశ్వంభర’ పూర్తవగానే ఏ చిత్రం ముందు మొదలుకానుందనే చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి సినిమానే ముందు పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, మార్చిలో మూవీ మొదలుపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నాడు. అలాగే ఇందులో  చిరంజీవిని  ఎలా చూపించబోతున్నాడో  హింట్ ఇచ్చాడు.

చిరంజీవి వింటేజ్‌‌ సినిమాలు గ్యాంగ్‌‌ లీడర్‌‌, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు తరహాలో సరికొత్త మాస్ క్యారెక్టరైజేషన్‌‌ను డిజైన్ చేస్తున్నట్టు తెలియజేశాడు. దీంతో ఈ సినిమాపై ఇప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సమ్మర్ స్పెషల్‌‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.