ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎన్నికలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న క్రమంలో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రమంతా నెలకొన్న రాజకీయ వేడి ఒక ఎత్తైతే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ వేడి మరో రేంజ్ లో ఉంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్, ఈసారి ఎలా అయినా గెలిచి తీరాలన్న కసితో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ నుండి మాత్రమే కాకుండా టాలీవుడ్ నుండి పెద్ద పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటికే వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ వంటి మెగా హీరోలు పిఠాపురంలో పవన్ తరఫున ప్రచారం నిర్వహించగా చిరంజీవి కూడా పవన్ మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు. మరో పక్క, అల్లు అర్జున్, నాని వంటి హీరోల కూడా మద్దతు తెలిపారు. ప్రచారానికి చివరి రోజైన 11న చిరంజీవి పిఠాపురంలో ప్రచారం నిర్వహించనున్నారనే గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
పిఠాపురంలో ప్రచారం అంటూ వస్తున్న వార్తలపై చిరంజీవి స్పందించారు. 11న పిఠాపురం వెళ్లట్లేదని,పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనట్లేదని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. పవన్ కళ్యాణ్ తన తరఫున ప్రచారం చేయమని కోరలేదని అన్నారు.తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని అన్నారు. ఎంజీఆర్ కు భారతరత్న వచ్చినప్పుడు ఎన్టీఆర్ కూడా రావటం సముచితం అన్నారు చిరంజీవి.