మెగాస్టార్ చిరంజీవి నట ప్రస్థానంలో మరో అరుదైన గౌరవం దక్కింది. తెలుగు సినీ రంగంలో అత్యధికంగా నృత్యరీతులు, విభిన్న ఆహార్యం, సినిమాల్లో ఉత్తమ నటనకుగాను ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో మెగాస్టార్‌కు చోటు దక్కింది. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో ఇవాళ (సెప్టెంబర్ 22) జరిగిన అవార్డ్ ప్రధానోత్సవ వేడుకల్లో బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్‌ను చిరంజీవి అందుకున్నారు.
ALSO READ | అక్కినేని తెలుగు వారి వెలుగు
ఈ వేడుకకు అతిథులుగా దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, బి.గోపాల్, కోదండరామిరెడ్డి హాజరయ్యారు. టాలీవుడ్‌తో పాటు భారత సినీ చరిత్రలో తన ఆట, పాట, యాక్షన్‌తో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మెగాస్టార్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కడంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, చిరంజీవి ఇప్పటి వరకు 155 సినిమాలలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. సినిమాల్లో అత్యధిక పాటల్లో డ్యాన్సులు చేసినందుకు గాను ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.