ఒంటరితనం తట్టుకోలేక నా ఫ్రెండ్ సూసైడ్: మెగాస్టార్ చిరంజీవి

వెలుగు, హైదరాబాద్: కల్చరల్ క్లబ్‎లు మనిషికి ఒంటరితనాన్ని దూరం చేస్తాయని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‎లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో  నూతనంగా ఏర్పాటు చేసిన కల్చరల్ క్లబ్‎ను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చిరంజీవి కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. కాలనీ కల్చరల్ క్లబ్‎ల వద్ద 60 ఏళ్ళు దాటిన నలుగురు,  ఐదుగురు వ్యక్తులు కలిస్తే కుర్రాల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. 

ALSO READ | షూటింగ్లో గాయపడిన హీరో రవితేజ: ఆస్పత్రిలో ఆపరేషన్

లోన్లీగా ఫీలవుతూ ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నించే వ్యక్తులకు అలాంటి ఆలోచనలు రాకుండా  కల్చరల్ క్లబ్‎లు దూరం చేస్తాయని అభిప్రాయపడ్డారు. రంగనాథ్ అనే నా స్నేహితుడు ఒంటరితనం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఈ సందర్భంగా చిరంజీవి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. కల్చరల్ క్లబ్‎లు  ఇంకా పెరగాలని ఆకాంక్షించారు చిరు. నూతనంగా ఏర్పాటు చేసిన కల్చరల్ క్లబ్‎లో స్పెషల్ ఇన్వెటీగా నాకు సభ్యత్వం కల్పిచడం సంతోషంగా ఉందన్నారు.