ఫొటోస్ వైరల్: విమానంలో చిరంజీవి-సురేఖ వెడ్డింగ్ యానివర్సరీ సెలెబ్రేషన్స్...

ఫొటోస్ వైరల్: విమానంలో చిరంజీవి-సురేఖ వెడ్డింగ్ యానివర్సరీ సెలెబ్రేషన్స్...

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో సక్సెస్ అవ్వడంలో తన సతీమణి కొణిదెల సురేఖ పాత్ర ఎంతగానో ఉందని పలు సందర్భాల్లో  తెలిపాడు. ఈరోజు చిరంజీవి సురేఖల పెళ్లి రోజు కావడంతో చిరు తన భార్యతో కలసి దుబాయ్ కి ట్రిప్ వెళ్ళాడు. ఈ క్రమంలో విమానంలో అక్కినేని నాగార్జున, అమల, ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ తదితరులతో కలసి చిరు దంపతులు వెడ్డింగ్ యానివర్సరీ ని సెలెబ్రేట్ చేసుకున్నారు. 

ఇందులో భాగంగా నాగార్జున దంపతులు, నమ్రత చిరు దంపతులకి పుష్ప గుచ్చాలు అందజేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. చిరంజీవి తన అధికారిక సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశాడు. అలాగే తన భార్య సురేఖ గురించి పలు ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు. 

"దుబాయ్ కి వెళ్తున్న కొంతమంది ప్రియమైన స్నేహితులతో విమానంలో మా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము.. సురేఖలో నా కలల జీవిత భాగస్వామిని కనుగొన్నందుకు నేను ఎల్లప్పుడూ చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఆమె నా బలం, ప్రపంచంలోని అద్భుతమైన తెలియని వాటి ద్వారా నావిగేట్ చేయడానికి ఎల్లప్పుడూ నాకు సహాయపడుతుంది. ఆమె ఉనికి నిరంతరం ఓదార్పునిస్తుంది మరియు అద్భుతమైన ప్రేరణనిస్తుంది." అంటూ పేర్కొన్నాడు. అలాగే తమకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన బంధువులు, స్నేహితులు,సన్నిహితులు ఇలా ప్రతీ ఒక్కరికీ ధనువాదాలు తెలియజేశాడు చిరు...

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి తెలుగులో "విశ్వంభర" సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి బింబిసార మూవీ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. దీంతో సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.