అది పోయిందంటూ మెగాస్టార్ చిరంజీవి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. కానీ ఏం జరిగిందంటే.?

అది పోయిందంటూ మెగాస్టార్ చిరంజీవి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. కానీ ఏం జరిగిందంటే.?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు. ఈ క్రమంలో చిన్న బడ్జెట్ సినిమాలకి సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చెయ్యడం వంటివి చేస్తూ సపోర్ట్ చేస్తుంటాడు.. ఈ క్రమంలో ప్రముఖ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ కాన్సెర్ట్ ని ప్రమోట్ చేస్తూ సపోర్ట్ చేశాడు. 

టైటిల్ చూడగానే అదేంటీ చిరు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్లాడని సందేహం రావచ్చు.. అక్కడికే వస్తున్నా... అయితే హైదరాబాద్ టాకీస్ వాళ్ళు మార్చ్ 22న సాయంత్రం సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఆధ్వర్యంలో "మై మ్యూజిక్ మై కంట్రీ" పేరుతో మ్యూజిక్ కాన్సెర్ట్ ని నిర్వహస్తున్నారు. దీంతో ఈ ఈవెంట్ ని ప్రమోట్ చెయ్యడానికి చిరు డిఫరెంట్ గా వీడియో చేశాడు. 

ALSO READ | ఓ భామ అయ్యో రామ సినిమాలో అతిథి పాత్రలో హరీష్‌‌‌‌ శంకర్‌‌‌‌

ఇందులోభాగంగా మా ఇంట్లో బంగారు కోడిపెట్ట ఉండేదని.. అది ఈమధ్య కనిపించడం లేదని దీంతో దగ్గరలోని పోలీసులకి కంప్లైంట్ చేసానని కానీ వారు కంప్లైట్ తీసుకోలేదని అన్నారు. ఆ తర్వాత ఎవరో మార్చ్ 22న జరిగే మ్యూజిక్ కాన్సెర్ట్ లో దొరుకుతుందని చెప్పారని దాంతో అందరూ ఈ ఈవెంట్ కి వెళ్లి చూడాలని తెలిపాడు. ఈ ఈవెంట్ లో కీరవాణి చిరు స్టెప్పులేసిన బంగారు కోడిపెట్ట సాంగ్ ని కూడా పాడబోతున్నాడు. అయితే చిరు పోలీస్ కంప్లైంట్ అనగానే ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ మ్యూజిక్ కాన్సెర్ట్ ప్రమోషన్స్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి 3 భారీ ప్రాజెక్టులతో బిజీ గా ఉన్నాడు. ఇందులో ఇప్పటికే మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ సమ్మర్ లో ఉండబోతోంది. ఇక దసరా మూవీ ఫేమ్ యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కూడా సినిమాని కన్ఫర్మ్ చేశాడు. ఈ సినిమాని ప్రముఖ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇటీవలే మరో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.