
టాలీవుడ్ లో 150కిపైగా సినిమాల్లో మెగాస్టార్ గా ఎదిగి ఎంతోమంది హీరోలకి ఆదర్శంగా నిలిచాడు. అయితే చిరంజీవి సాధారణ కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ హీరోగా, రాజకీయ నాయకుదిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు చిరంజీవి బ్లడ్ గ్రూప్ ని స్థాపించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతోమందికి రక్తదానం చేస్తున్నారు. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి తన అమ్మ, చెల్లెళ్ళు విజయ దుర్గ, మాధవి, సోదరుడు నాగబాబు తో కలసి స్పెషల్ ఇంటర్వూలో ఆసక్తికర విషయాల్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు.
చిరంజీవి చిన్నప్పుడే తన తల్లి అంజనాదేవికి గర్భస్రావం కారణంగా 3 పిల్లలని కోల్పోయిందని తెలిపాడు. ఇక తానూ 6వ తరగతి చదువుతున్నప్పుడు రమణ అనే సోదరి ఉండేదని అయితే రమణకి బ్రెయిన్ ట్యూమర్ సమస్య రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించిందని ఎమోషనల్ అయ్యాడు. తన సోదరి మరణించిన సమయంలో తన తండ్రి ఇంట్లో లేడని డీఎంతో దహన సంస్కారాలు ఎలా చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని అప్పుడు కొందరు ఇరుగుపొరుగువారు సహాయం చేశారని దాంతో రిక్షాలో తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసామని చెప్పుకొచ్చాడు.. దీంతో చిరు మాటలు వినగానే ఒక్కసారిగా అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇక తన తల్లి అంజనాదేవి గురించి మాట్లాడుతూ నాన్న డ్యూటీ పని మీద తిరుగుతుంటే తల్లి అందరినీ కష్టపడి పెంచిందని తెలిపాడు.
ALSO READ | ప్రభాస్ సినిమాలో నలుగురు హీరోయిన్స్.. రొమాన్స్ ఎక్కువైతే కష్టమేనేమో..!
ఈ విషయం ఇలా ఉండగా విశ్వంభర చిత్రంలో మెగాస్టార్ విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తునాడు. చిరు సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. గత ఏడాది ఈ చిత్ర టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.