ఆర్‌‌‌‌‌‌‌‌సీ 16 షురూ..ముహూర్తపు స‌‌‌‌న్నివేశానికి  చిరంజీవి క్లాప్

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా ‘ఉప్పెన’ ఫేమ్  బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా, ముహూర్తపు స‌‌‌‌న్నివేశానికి  చిరంజీవి క్లాప్ కొట్టారు.  బోనీ క‌‌‌‌పూర్ కెమెరా స్విచాన్ చేశారు. శంక‌‌‌‌ర్ గౌర‌‌‌‌వ ద‌‌‌‌ర్శక‌‌‌‌త్వం వ‌‌‌‌హించారు.  అల్లు అర‌‌‌‌వింద్ చేతుల మీదుగా చిత్ర యూనిట్ స్క్రిప్ట్‌‌‌‌ను అందుకున్నారు.  రామ్ చరణ్ నటిస్తున్న 16వ సినిమా ఇది. ఆర్‌‌‌‌‌‌‌‌సీ 16 వర్కింగ్ టైటిల్‌‌‌‌తో ఈ చిత్రం రూపొందుతోంది. మైత్రీ మూవీ మేక‌‌‌‌ర్స్‌‌‌‌, సుకుమార్ రైటింగ్స్ స‌‌‌‌మ‌‌‌‌ర్పణ‌‌‌‌లో వృద్ధి సినిమాస్ బ్యాన‌‌‌‌ర్‌‌‌‌పై వెంక‌‌‌‌ట స‌‌‌‌తీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘బుచ్చిబాబుకి సినిమా అంటే పిచ్చి. రంగస్థలంలో సుకుమార్ అసిస్టెంట్‌‌‌‌గా తను ట్రావెల్ అయ్యాడు.  ఉప్పెనతో పెద్ద సక్సెస్ చూశాడు. నేను నాకెరీర్‌‌‌‌లో ఇంత త్వరగా ఏ.ఆర్.రెహమాన్‌‌‌‌గారితో పని చేస్తానని అనుకోలేదు. కచ్చితంగా అద్భుతమైన సినిమా చేస్తామనే నమ్మకం ఉంది. నేను, జాన్వీ కలిసి జగదేకవీరుడు- అతిలోక సుందరి అనే సినిమా చేయాలని చాలా మంది అనుకున్నారు.

మా కాంబినేషన్ ఈ సినిమాతో నిజం కాబోతుండటం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నాడు. బుచ్చిబాబు క్రేజీ పర్సన్ అని, తన ఆలోచనలు గొప్పగా ఉంటాయని, ఇప్పటికే మూడు ట్యూన్స్ పూర్తి చేశామని మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాడు దర్శకుడు బుచ్చిబాబు. ఈ కార్యక్రమానికి బోనీ కపూర్, చిత్ర స‌‌‌‌మ‌‌‌‌ర్పకులు సుకుమార్, నిర్మాతలు నవీన్ యేర్నేని, రవిశంకర్,  దిల్ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ ఆచంట, నాగవంశీ తదితరులు హాజ‌‌‌‌ర‌‌‌‌య్యారు.