విశ్వంభర కోసం చిరంజీవి స్పెషల్ వర్కౌట్.. వీడియో వైరల్

విశ్వంభర కోసం చిరంజీవి స్పెషల్ వర్కౌట్.. వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర(Vishwambhara). బింబిసార ఫేమ్ వశిష్ట(Vassishta) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలైంది. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీనెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సంక్రాంతి కానుకగా విడుదల చేసిన టైటిల్ వీడియో ఆ అంచనాలను మరింత పెంచేసింది. అత్యంత భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటూ కామన్ ఆడియన్స్ సైతం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. 

ఇదిలా ఉంటే.. మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గా వస్తున్న ఈ సినిమాను మెగాస్టార్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం జిమ్ లో ప్రత్యేకమైన వర్కౌట్స్ మొదలుపెట్టారు చిరు. యాక్షన్ సీక్వెన్సెస్ కోసం యంగ్ హీరోల్లా బాడీను షేప్ చేసే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు మెగాస్టార్ దానికి.. గేరింగ్ అప్ అండ్ రేరింగ్ గో టు విశ్వంభర.. అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం  వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వీడియోలో కష్టపడుతున్న చిరును చూసి నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్, ఈ ఏజ్ లో కూడా ఎనర్జిటిక్ గా జిమ్ చేస్తూ ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్నారంటూ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్ షూట్ ను ఈమధ్యనే మొదలువుపెట్టారు మేకర్స్. ఈ యాక్షన్ సీక్వెన్స్ ను ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్షణ్ తెరకెక్కించనున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసమే బాడీని షేప్ చేసుకుంటున్న మెగాస్టార్.. త్వరలోనే సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.