
మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు. అయితే తన సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేన తరపున కాదు. కాంగ్రెస్ పార్టీ తరపునే ప్రచారాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరపును ప్రచారాన్ని నిర్వహించేందుకు చిరు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ప్రకటించారు. మరోవైపు, చిరంజీవికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంధువు. తన కోడలు ఉపాసనకు విశ్వేశ్వర్ రెడ్డి స్వయానా చిన్నాన్న.