లంచ్ టైమ్ లో చిరుకు జగన్ అపాయింట్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని  మెగాస్టార్ చిరంజీవి కలవనున్నారు. లంచ్ టైమ్ లో చిరుకు జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఏపీ సీఎంతో కలిసి చిరంజీవి లంచ్ చేయనున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చిరు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై ప్రధనంగా వీరి మధ్య చర్చ జరగవచ్చు. రోజురోజుకీ టికెట్ల ధర వివాదం పెద్దదవుతండటంతో.. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చిరంజీవి భావిస్తున్నారని సమాచారం. జగన్ ని కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించనున్నారు చిరంజీవి. కొవిడ్ వల్ల సినిమా థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని జగన్ ను చిరు కోరనున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీపై వైఎస్ ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను జగన్ దృష్టికి తీసుకుళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు దర్శకులు, నిర్మాతలు విడత వారీగా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఇటీవలే దర్శకుడు ఆర్జీవీ, ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసి ఇండస్ట్రీకి కలిగే నష్టాన్ని వివరించారు. 

ఇవి కూడా చదవండి: 

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

టికెట్ ధరలపై ప్రభుత్వానికి అధికారం  ఉంది