Vishwambhara: అఫీషియల్.. విశ్వంభర ఫస్ట్ సింగిల్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

Vishwambhara: అఫీషియల్.. విశ్వంభర ఫస్ట్ సింగిల్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర (Vishwambhara). టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట (Vassishta) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను.. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 

లేటెస్ట్గా విశ్వంభర మూవీ టీమ్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. రేపు ఏప్రిల్ 11న విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. "తన ప్రభువు శ్రీరాముడి పట్ల హనుమంతుని ప్రేమ మరియు గౌరవం..రామరామ పాటతో చూస్తారు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. రామ రామ అంటూ రానున్న ఈ పాటకు 'సరస్వతీపుత్ర' రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు.

ఈ పాటను ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ప్రముఖ దేవాలయంలో హనుమాన్ విగ్రహం దగ్గర రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమాలో కూడా హనుమాన్ విగ్రహం దగ్గర పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు మేకర్స్. ఇందుకోసం ప్రత్యేకంగా 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించారు. 

ఈ సినిమాలో ఆషిక రంగనాథ్, సురభి,వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, ప్రవీణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.