![Chiranjeevi Vishwambhara : మెగాస్టార్ యాక్షన్ మోడ్ షురూ..అప్డేట్ ఇచ్చిన విశ్వంభర టీం](https://static.v6velugu.com/uploads/2024/01/chiranjeevi-vishwambhara-gets-into-action-mode_MYA43o6szu.jpg)
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర (Vishwambhara). బింబిసార దర్శకుడు వశిష్ట (Vassishta) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల విడుదలైన విశ్వంభర టైటిల్ వీడియో సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐనా క్షణాల్లో వైరల్ అవుతోంది.
లేటెస్ట్గా యూనివర్స్‌ను మించిన మెగా మాస్.. డైరెక్టర్ వశిష్ఠ, DOP చోటా కే నాయుడు విశ్వంభర కోసం పాపులర్ యాక్షన్ డైరెక్టర్స్ రామ్-లక్ష్మణ్‌తో ఫైట్ సీక్వెన్స్ కోసం యాక్షన్ కొరియోగ్రఫీ చర్చలు షురూ అయ్యాయని..మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ స్టిల్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడీ స్టిల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
MEGA MASS BEYOND UNIVERSE gets into action mode ??
— UV Creations (@UV_Creations) January 30, 2024
Director @DirVassishta, DOP @NaiduChota have begun the Action Choreography discussions with renowned action directors #RamLakshman masters for the fight sequences of #Vishwambhara ??
MEGASTAR @KChiruTweets @mmkeeravaani… pic.twitter.com/HL77j9I1TI
ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు మేకర్స్. అంతేకాదు.. ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నామని, ఆ క్రమంలో వచ్చే విజువల్స్ ఆడియాన్స్ ను మెస్మరైజ్ చేస్తాయని, ఖచ్చితంగా ఈ సినిమా చిరంజీవి కెరీర్లో టాప్ 3లో ఉంటుందని దర్శకుడు వశిష్ట ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు.
ఆర్‌ఆర్‌ఆర్ లాంటి భారీ చిత్రానికి పనిచేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఆరు పాటలుంటాయని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు ఎంఎం కీరవాణి.
మరి ఈ సినిమా ఆడియన్స్ కు ఎలాంటి అనుభూతిని మిగిల్చనుందో చూడాలంటే 2025 సంక్రాంతి వరకు ఆగాల్సిందే. విశ్వంభర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ మరియు ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు