‘ఆచార్య’ చిత్రంలో కాస్త క్లాస్‌గా కనిపించిన చిరంజీవి.. నెక్స్ట్ మూవీస్‌లో తనలోని మాస్ క్యారెక్టర్‌ను పూర్తిగా బయటపెట్టబోతున్నారు. చేతిలో చాలా సినిమాలున్నాయి. ముందుగా ‘భోళా శంకర్’పై ఫోకస్ పెట్టారు. ఆల్రెడీ ఓ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. కొత్త షెడ్యూల్‌ను జూన్ 21 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘ఆచార్య’ రిజల్ట్ తర్వాత చిరు ఆచితూచి అడుగులేస్తున్నారని, ‘భోళా శంకర్’ మూవీని పూర్తిగా పక్కన పెట్టేయాలనుకున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. ఇప్పటివరకు వచ్చిన ఔట్‌పుట్ చూసిన చిరు శాటిస్‌ఫై అవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. దీంతో రంగంలోకి దిగిన టీమ్ ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తూ ఈ అప్‌డేట్ ఇచ్చింది. ఇందులో చిరంజీవి అల్ట్రా మాస్ లుక్‌లో కనిపించనున్నారు. తమన్నా హీరోయిన్. కీర్తి సురేష్ చిరుకి చెల్లెలిగా నటిస్తోంది. రఘుబాబు, రావు రమేష్, మురళీశర్మ, వెన్నెల కిశోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, ఉత్తేజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో పాటు మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’తో పాటు బాబి డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నారు చిరంజీవి. వెంకీ కుడుముల డైరెక్షన్‌లోనూ యాక్ట్ చేయబోతున్నారు.